Leading News Portal in Telugu

Nara Lokesh: పవన్‌ కల్యాణ్‌కు లోకేష్‌ ధన్యవాదాలు.. నా అన్న..!


Nara Lokesh: నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టం సమయంలో అండగా నిలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజలు, దేశం ,అభివృద్ధి గురించి తప్ప.. మరో ఆలోచన చేయని వ్యక్తి చంద్ర బాబు.. అవినీతి గురుంచి తెలియని వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ సైకో ప్రభుత్వం జైల్లో పెట్టిందని మండిపడ్డారు.. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బంద్ కి మద్దతు ఇచ్చారని తెలిపిన ఆయన.. బంద్‌కి సహకరించిన అన్నగా భావించే పవన్ కల్యాణ్‌కి వామపక్షాలుకి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్ ఈ అరెస్ట్ కి మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్‌ ఇచ్చారు.. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి.. దానికి సమాధానం చెప్పగలడా? వ్యవస్థలు ఎంత అద్బుతంగా మెనేజ్ చేస్తున్నాడో తెలుస్తుందన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ ఫేక్ కేసు.. ఇదే ప్రాజెక్ట్ మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో అమలు చేశారు.. ఏడు రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారుని తెలిపిన నారా లోకేష్‌.. మరి ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లాంపై ఎందుకు కేసు పెట్టలేదు? అని నిలదీశారు. చంద్రబాబుకి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చిందో ఆధారాలుతో సహా ప్రభుత్వం నిరూపించగలదా? అని సవాల్‌ చేశారు. మంత్రులు సంబరాలు చేసుకుంటుంటే ఎంత కక్ష్య పెట్టుకున్నారో అర్ధం అవుతుందన్నారు.. ఎన్ని సార్లు జైలుకి వెళ్ళడానికి అయిన సిద్ధం గా ఉన్నాం.. సైకో జగన్ చాలా తప్పులు చేస్తున్నాడు.. ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను అని ప్రకటించారు.. ఇక, చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారని మంత్రులకు ముందు ఎలా తెలుసు అని ప్రశ్నించారు లోకేష్‌.. నేను రాజమండ్రి లో ఉన్నాను.. ఎక్కడికి పారిపోలేదన్నారు.

చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రానికి సమాచారం ఇచ్చారో లేదో బీజేపీ నేతలను అడగాలన్నారు లోకేష్‌.. వోక్స్ వ్యాగన్ ఎందుకు వెళ్లిపోయిందో బొత్స చెప్పాలని నిలదీసిన ఆయన.. సీఐడీని కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్‌గా అభివర్ణించారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు.. ఇందిరా గాంధీను కూడా ఎదిరించాం.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని తట్టుకున్నాం.. ఈ సైకో జగన్‌ ఎంత? అని ప్రశ్నించారు. మరోవైపు.. యువ గళం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు లోకేష్‌.. ఎన్నికలు వస్తే ఈ సైకో ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. సజ్జల ప్యాలెస్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. ఇక, ములాఖత్ కి అప్లై చేశాం.. రేపు జైలులోకి చంద్రబాబును కలుస్తామని వెల్లడించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు జరుగుతాయి.. ఎల్లుండి నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతాయి.. మేం మనుషులమే మాకు బాధ, ఆవేదన ఉంటాయి.. షాక్ లో ఉన్నాం అన్నారు.. చంద్రబాబు పెళ్లి రోజు అయినా మాట్లాడాలని చెప్పిన టైమ్ లేదని ఒత్తిడి చేసి తీసుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్‌.. స్కిల్ డెవలప్మెంట్ నాకు సంబంధం లేని డిపార్ట్‌మెంట్‌ అని స్పష్టం చేశారు.. మీ పోరాటం అపొద్దు అని చంద్రబాబు నాకు చెప్పారని గుర్తుచేసుకున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.