ACB Court: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, చంద్రబాబును హౌస్ రిమాండ్ కు అనుమతించాలనంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది.. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు వినిపించారు ఇరు పోఆల న్యాయవాదులు.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగారు.. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది విజయవాడ ఏసీబీ కోర్టు.. రేపు మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.. అయితే, తీర్పు రేపు ఉదయం ఇవ్వాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. కాగా, స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం విదితమే.. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ వాధిస్తోంది.. మరోవైపు.. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.