Leading News Portal in Telugu

Harsha Kumar: చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర..!


Harsha Kumar: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్‌.. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ కుట్ర ఉందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైన చంద్రబాబు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు హర్షకుమార్‌.. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు.. ఎన్నికల్లో ఎన్డీఏను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.

మరోవైపు.. అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉండగా.. రాజమండ్రిలో సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు నారా లోకేష్‌.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత పరిణామాలపై చర్చించారు. బంద్‌ ఎలా సాగిందనే విషయాలపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. రాజమండ్రిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్..