Chandrababu Case Judgment: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ న్యాయస్థానంలో షాక్ తగిలింది.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం.. ఆ తర్వాత ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే కాగా.. అయితే, చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం, సెక్యూరిటీ దృష్ట్యా.. ఆయనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. రెండు రోజుల పాటు ఓవైపు సీఐడీ తరపు న్యాయవాదులు.. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు.. ఇక, కాసేపటి క్రితమే తీర్పు వెలువరించింది ఏసీబీ కోర్టు.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది ఏసీబీ కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవిచింది.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ముప్పులేదన్న సీఐడీ వాదనాలు ఏకీభవించింది.. కానీ, భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో విభేదించింది.. ఇదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేపర్ల పరిశీలనకు చంద్రబాబు లాయర్లకు అనుమతి ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.