Leading News Portal in Telugu

Harsh Goenka: ఇస్రో ఛైర్మన్‌ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త


Harsh Goenka: ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు ఎన్నో అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.. తాజాగా, ఆయన చేసిన ఓ ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుటుంది.. అసలు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతం ఎంత? అంటూ నెటిజన్లకు ప్రశ్న వేసిన ఆయన.. ఇస్రో చీఫ్‌ నెల జీతం గురించి చెబుతూనే ఆయన పంచుకున్న అంశాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

”ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ నెలకు రూ. 2.5 లక్షల జీతం తీసుకుంటున్నారు.. మీరు చెప్పండి. ఇది ఆయనకు సరైన జీతమేనా? అంటూ ప్రశ్నించారు గోయెంకా.. డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు ఆయన లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అని రాసుకొచ్చారు.. సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సోమనాథ్‌ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారు.. కాబట్టి ఆయన లాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశారు.. మొత్తంగా తన పోస్ట్‌లో, ఇది సరసమైన నెలవారీ ఆదాయమా అని ప్రజలను అడగడమే కాకుండా, సైన్స్ మరియు పరిశోధనపై సోమనాథ్‌కు ఉన్న అభిరుచి గురించి కూడా పేర్కొన్నారు హర్ష్ గోయెంకా.. అయితే, ఈ పోస్ట్ నిన్న (సెప్టెంబర్ 11న) షేర్ చేశారు.. పోస్ట్ చేసినప్పటి నుండి 8.13 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌ సాధించింది.. వెయ్యి మందికి పైగా రీ ట్వీట్‌ చేస్తూ కామెంట్లు పెట్టగా.. 9 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో చాలా మంది తమ స్పందనలను కూడా పంచుకున్నారు.

అయితే, ఓ నెటిజన్‌ “ఇది ఇల్లు, కారు, సేవకులు మరియు ఇతర ద్రవ్యేతర సౌకర్యాల వంటి ఇతర ప్రయోజనాలపై కూడా ఆధారపడి ఉండాలి.. కానీ, మీరు చెప్పినట్లుగా, అతను డబ్బును అతిపెద్ద ప్రేరణగా పరిగణించాడు. అతనికి విజయం, దేశం యొక్క గర్వం అతిపెద్ద అంశం.”గా రాసుకొచ్చారు.. “ఖచ్చితంగా! ఇస్రోలో ఛైర్మన్ సోమనాథ్ వంటి వ్యక్తుల అంకితభావం మరియు అభిరుచి ఎనలేనిది. వారి పని బహుమతులకు మించినది, సైన్స్, పరిశోధన మరియు వారి దేశం యొక్క శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధతతో నడపబడుతుంది. వారు నిజమైన ప్రేరణలు, మరియు సమాజానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది.” అంటూ కామెంట్ పెట్టారు.. మొత్తంగా.. హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌చేస్తోంది.