Kotamreddy Sridhar Reddy:

Kotamreddy Sridhar Reddy
దీంతో ఆమె శ్రీధర్ రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇరువురి మధ్య దళిత విభేదాలను పరిష్కరించేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. దీంతో మేయర్ తన భర్త జయవర్ధన్‌తో కలిసి తాడేపల్లిలోని వైసీపీ నేతలను కలిశారు. శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరినప్పుడు మేయర్ భర్త జయవర్ధన్ ఆయనతో పాటు పార్టీలో చేరారు.
ఆమె మాత్రం టీడీపీలో చేరకుండా శ్రీధర్ రెడ్డికి మద్దతిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విభేదాలు తీవ్రం కావడంతో ఆమె వైసీపీ నేతలతో చర్చించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో మేయర్ దంపతులు సమావేశమై పరిస్థితిని చర్చించినట్లు తెలిసింది. దీంతో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలతో చర్చించాలని సూచించినట్టు సమాచారం. మేయర్ దంపతులు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.