Leading News Portal in Telugu

AP CM Jagan Review: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ బ్రోచర్‌ను విడుదల చేసిన సీఎం జగన్‌


AP CM Jagan Review: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, పలువురు అధికారులు పాల్గొనున్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఈ బ్రోచర్‌లో వివరించినట్లుగా తెలుస్తోంది.