Leading News Portal in Telugu

Chandrababu Arrest: భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ.. అసలు విషయం ఇదేనా..?


Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకోవడం.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడం చర్చగా మారింది.. అయితే.. వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి.. ములాఖత్‍ విషయంలో ఏపీ ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. కాదన్నారంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు..

అయితే, ఈ ఘటనపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు.. చంద్రబాబుతో ములాఖత్ కోసం భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు.. రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ అవకాశం ఉంటుందన్నారు.. ముగ్గురు సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. అత్యవసరమైతే దానికి గల కారణం వాస్తవం నిర్ధారణ జరిపి మూడో ములాఖత్‌ను మంజూరు చేసే అధికారం జైలు సూపరింటెండెంట్‌కు ఉంటుందిని తెలిపారు. అయితే, అత్యవసర కారణాలను నారా భువనేశ్వరి ప్రస్తావించనందున మూడో ములాఖత్ మంజూరు చేయలేదని క్లారిటీ ఇచ్చారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంచార్జ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్నారు డీఐజీ రవి కిరణ్.