Leading News Portal in Telugu

YSR Congress Party: ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. గణాంకాలు బయటపెట్టి విచారణకు విజ్ఞప్తి


YSR Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గణాంకాలతో సహా ఫిర్యాదు లేఖ అందజేశారు పేర్ని నాని.. 2014-19 మధ్య భారీగా ఓటర్లు పెరిగాయని.. ఐదేళ్ల టీడీపీ పాలన హయాంలో ఏకంగా 8.1 శాతం ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. 2014-23 మధ్య ఏపీలో జనాభా పెరుగుదల రేటు 1.1 శాతం ఉందని పేర్కొన్నారు.. మరోవైపు.. 2019-23 మధ్య ఓటర్ల సంఖ్య తగ్గిందని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 0.09 శాతం ఓటర్ల సంఖ్య తగ్గిందని ఎన్నికల కమిషన్‌కు వివరించారు.. గణాంకాల్లో స్పష్టం అవుతున్న ఓటర్ల జాబితాలోని అవకతవకలపై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ నేతలు.