Leading News Portal in Telugu

Minister Amarnath: పవన్ చెపితే కాపులు ఎందుకు టిడిపికి ఓటు వేస్తారు..!


సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్ కు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన అన్నారు. ఈడీ, సీఐడీ ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.. వాటికి ముందు సమాధానం చెప్పు.. 118 కోట్లుకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ మంత్రి సెటైర్ వేశారు. పంది కొక్కుకులు తిన్నట్లు 371 కోట్ల రూపాయల ప్రజా దనం తినేసి మాట్లాడుతున్నారు.. ఒళ్ళు బలసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. నెక్స్ట్ లోకేష్ నే జైల్ కు వెళ్ళేది.. దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

రెండు ఎకరాల నుంచి 680 కోట్లు ఎలా సంపాదించారు.? అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నకిలీ కాపు.. పవన్ చెపితే కాపులు ఎందుకు టీడీపీకి ఓటు వేస్తారు.. కాపులకు చంద్రబాబు చేసింది ఏమిటో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం కుటంబంను చంద్రబాబు వేదిస్తే ఎందుకు పవన్ మాట్లడలేదు.. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదు.. కాపు ప్రముఖులు సమావేశమైతే ఎందుకు పవన్ వెళ్ళలేదు.. చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెడితే కాపులు ఎందుకు టీడీపీకి ఓట్లు వేస్తారు అంటూ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ సినిమాల్లో యాక్టింగ్, రాజకీయల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మీ పార్టీ విలీనం చేసి ఒక జెండా పెట్టుకోవచ్చు కదా.. జన సైనికులు జెండా కూలీలు.. ఒక దొంగని కాపాడటానికి తోడు దొంగలు రెడీ అయ్యారు. అసెంబ్లీలో చర్చకు సిద్దం.. రమ్మనండి అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.