
AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో గవర్నర్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.. గవర్నర్కు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు.. రోబోటిక్ విధానంలో గవర్నర్ కు సర్జరీ చేస్తున్నట్టు సమాచారం.. అయితే, నిన్న రాత్రి నుంచి గవర్నర్కు కడుపులో నొప్పి ఉండటంతో స్వల్ప అస్వస్థత గురయ్యారని చెబుతున్నారు.. ఉదయం రాజ్ భవన్ వెళ్లి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. అయినా తగ్గకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు గవర్నర్.. శస్త్ర చికిత్స అనంతరం రేపు గవర్నర్ డిశ్చార్జి అవుతారని మణిపాల్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.. అయితే, ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఎలాంటి వైద్యం అందిస్తున్నారు లాంటి విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Business Ideas: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం..