Leading News Portal in Telugu

Health Bulletin: ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల.. ఆరా తీసిన సీఎం..


Health Bulletin: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పొత్తి కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారని బులెటిన్‌లో పేర్కొన్నారు మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్.. వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్న ఆయన.. గవర్నర్ కి విజయ వంతంగా రోబోటిక్ అసిస్టెడ్ అపెండెక్టమీ జరిగిందన్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్.

మరోవైపు.. గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న విషయం విదితమే కాగా.. ఈ మధ్యాహ్నం అస్వస్థతకు గురైన గవర్నర్‌ విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం- అధికారులతో మాట్లాడారు. గవర్నర్‌కు అపెండిసైటిస్‌ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారని సీఎంకు అధికారులు తెలిపారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్‌ జగన్‌.

Whatsapp Image 2023 09 18 At 9.00.54 Pm