Leading News Portal in Telugu

Srinivasa Setu Flyover: తీరిన ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ప్రారంభించిన సీఎం జగన్‌


Srinivasa Setu Flyover: కళియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూనే ఉంటారు.. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు భక్తులు.. ఇక, విదేశాల నుంచి సైతం వెంకన్న దర్శనానికి తరలివస్తుంటారు.. దీంతో.. తిరుపతిలో ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ పరిస్థితికి ఓ ఫ్లైఓవర్‌తో చెక్‌ పెట్టారు ముఖ్యమంత్ర వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతికి మణిహారంగా భావిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ఈ రోజు ప్రారంభించారు సీఎం.. తన తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ను ప్రారంభించారు సీఎం జగన్‌.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి మణిహారంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిలుస్తుందని తెలిపారు.

ఇక, శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టును తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా చేపట్టిందని వెల్లడించారు సీఎం జగన్‌.. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో.. యాత్రికులతో పాటు.. స్థానిక ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.684 కోట్లు వెచ్చించి.. దాదాపు 7.34 కిలోమీటర్లు విస్తీర్ణంలో నిర్మించారు.. 2019 మార్చిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ ఏడాది జూన్‌ లేదా జులై నెలలోనే పనులు పూర్తి అవుతాయని భావించినా.. నిర్మాణం చివరి దశకు చేరుకున్న తర్వాత చోటు చేసుకున్న ప్రమాదంతో పనులు పూర్తి చేయడానికి మరింత సమయం పట్టింది.. మొత్తంగా.. ఈ రోజు శ్రీనివాససేతు ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, తిరుపతి పర్యటనలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ భవనాలను కూడా ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.