Leading News Portal in Telugu

CM Jagan: నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన!



Ap Cm Jagan

AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధి­పతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు.

నేడు సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50లో స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేస్తారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తారు.

Also Read: Mohammed Siraj: చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓవర్‌.. మొహ్మద్ సిరాజ్‌ బుల్లెట్ బంతుల వీడియో!

సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని సీఎం జగన్ దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు. సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు. ఆపై పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు.