Food Poisoning at KVB Puram in Tirupati: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలోని ప్రజలకు ఫుడ్ పాయిజన్ అయింది. ప్రసాదం తిన్న 79 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వైద్యశాఖ అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు.
వినాయక ప్రసాదాన్ని భక్తులు ఆరె గ్రామంలోని ఇంటింటికి పంచినట్టు సమాచారం తెలుస్తోంది. ప్రసాదం తిన్న అనంతరం గ్రామస్థులు అతిసారానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన గ్రామస్తులు.. కేవీబీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.