Leading News Portal in Telugu

Funny Case: కోసిగి పీఎస్‌లో విచిత్రమైన ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు!


Funny Case Filed in Kosigi PS: సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కొన్నికొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితులలో పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కక తప్పదు. ఏదైనా తగాదాలు జరిగితేనో, మన వస్తువులు ఎవరైనా దొంగిలిస్తేనో లేదా ఏదైనా ప్రమాదం జరిగితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అయితే ఓ వ్యక్తి తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని, తాను దేవుడిని అంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా కోసిగి మండలం పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఓ విచిత్రమైన ఫిర్యాదు నమోదు అయింది. తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని, తాను దేవుడిని అంటూ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏపీ బ్యాంకులలో ఉన్న డబ్బులు అన్ని తనవే అని, ఎవరో ఆ డబ్బును మొత్తం దొంగతనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనను ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని సదరు వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదుతో కోసిగి పోలీస్ స్టేషన్‌ అధికారులు తలలు పట్టుకున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మెంటల్ కండిషన్ సరిగా ఉందా? లేదా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా తాను దేవుడిని అంటూ ఓ వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.