AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుండగా.. లక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా రేపటి (గురువారం) నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్హణతో పాటు సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చించనున్నారని తెలుస్తోది.. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెటనున్న బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని నెలకొన్న తాజా రాజకీయ పరిణాలతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం వైఎస్ జగన్.. మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం.. ఇదే సమయంలో.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం.. చంద్రబాబుపై వరుసగా కేసులు.. ఇలా అనేక విషయాలపై కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.