Leading News Portal in Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..


AP Cabinet Key Decisions: సచివాలయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్‌.. దీనికి సంబంధించిన బిల్లుపైచర్చించి ఆమోదం తెలిపింది.. రేపు అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఇక, మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్న ఆయన.. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలని ఆదేశించారు. రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఈ రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో 49 అంశాల పై చర్చించారు.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం తీసుకురానున్నారు.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది.. UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్షపై కేబినెట్‌ చర్చించింది.. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ.. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు ఇలా పలు అంశాలపై కీలకంగా చర్చించింది ఏపీ కేబినెట్‌.