Leading News Portal in Telugu

Tomato Price: అప్పుడు కిలో రూ.200, ఇప్పుడు రూ.2.. ఎక్కడో తెలుసా..!


Tomato Price: గత రెండు నెలల క్రితం దేశ వ్యాప్తంగా మంట పుట్టించిన టమాటా.. ఇప్పుడు చవకై పోయింది. కిలో రూ.300కు పలికి చుక్కలు చూపించి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమోటా రూ. 2 కూడా పలకడం లేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ధరలు తగ్గడం సామాన్యులకు మంచిదే అయినప్పటికీ.. టమాటా రైతులకు మాత్రం కోలుకోని నష్టం అని చెప్పవచ్చు. కనీసం పండించిన పంటకు కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాట ధరలు లేక రోడ్లపై పారబోస్తున్నారు.

మార్కెట్ కు టమాటా దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో ఇలా ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు గత రెండు నెలల క్రితం చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా టమాటా ధరలు మోత మోగించాయి. అప్పుడు టమాటా రైతుల్లో కొందరు కోట్లలో లాభాలను పొందారు. ఆ సమయంలో మధ్యతరగతి వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు కొందరైతే విపరీతమైన ధరలు ఉన్నాయని.. వాటిని తినడమే మానేశారు. కానీ సీన్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏ కూరల్లో చూసినా.. టమాటా కనపడుతుంది.