Leading News Portal in Telugu

Krishna District: అయ్యంకిలో భగ్గుమన్న పాతకక్షలు.. భార్యాభర్తలు దారుణ హత్య


Krishna District: పాత కక్షలు ప్రాణాలు తీసేదాకా వదలవు. తన పగ చల్లారంతే వరకు అనుక్షణం దాని గురించే ఆలోచిస్తూ.. ఎలానైనా మట్టుబెట్టాలని చూస్తారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా.. రౌడీలతో కానీ, లేదంటే తానే అనేక విధాలుగా పన్నాగాలు పన్ని చివరకు హతమార్చడమే తన పని. ఆస్తి, పిల్లల వ్యవహారాల లాంటి కారణాల వల్ల తన కుటుంబీలను సైతం కడతేర్చుతారు. ఇలాంటి వాటిని నిర్మూలించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు. చంపుతానే ప్రశాంతంగా నిద్ర పడుతుందన్నట్లు చంపేదాకా సరిగా నిద్రపోరు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా అయ్యంకిలో మరోసారి ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపైన చంపేశారు. ఈమె భర్త వీరంకి వీర కృష్ణను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు. ఒకేరోజు రెండు జంట హత్యలు జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరిని అతి దారుణంగా హత్య చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై భార్యాభర్తలు ఇద్దరిని కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. అయితే ఈ ఘటనకు పాల్పడినది మృతుడు తమ్ముడు కుమారులుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.