Leading News Portal in Telugu

AP Assembly: ముగిసిన బీఏసీ.. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు


AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడగా.. పోటీగా వైసీపీ సభ్యులు పోడియం దగ్గరకు దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.. మొదట సభను వాయిదా వేసిన స్పీకర్‌.. ఆ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు.. ఆ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు.. బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం వైఎస్‌ జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చిప్ విప్ ప్రసాద్ రాజు.. అయితే, ఈ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది.. అయితే, ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు శాసన సభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.. అయితే, శని, ఆదివారం శాసన సభకు సెలవు ఉంటుందని బీఏసీ సమావేశంలో ప్రకటించారు. రేపు శాసన సభలో ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసుపై చర్చించారు. రోజుకు రెండు చొప్పున 8 అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.