Leading News Portal in Telugu

Minister Karumuri Nageswara Rao: చంద్రబాబు నీతిమంతుడు అయితే.. టీడీపీ నేతలు ఎందుకు పారిపోయారు..?


Minister Karumuri Nageswara Rao: అసెంబ్లీ నుంచి ఎందుకు టీడీపీ నేతలు పారిపోయారు.. చంద్రబాబు నీతిమంతుడు అయితే ఎందుకు అసెంబ్లీలో చర్చకు సిద్ధం కాలేదు అని నిలదీశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. చంద్రబాబు అవినీతి చేయలేదని ఎన్టీఆర్ ఫ్యామిలీ, కార్యకర్తలు, ప్రజలు నమ్మరన్న ఆయన.. చంద్రబాబు 14 ఏళ్లు స్కాములే చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ని అమెరికా ఎందుకు పంపారు? అని నిలదీశారు. బొంకడం మాత్రమే తెలుసు చంద్రబాబు కి.. చంద్రబాబు వి స్కామ్‌లు.. జగన్ వి స్కీమ్‌లు అని అభివర్ణించారు.

లోకేష్ ఈ స్కాంలో పాత్రధారుడు, సూత్రధారుడు కనుకే దాక్కున్నాడు అని ఆరోపించారు మంత్రి కారుమూరి.. ఇక, నందమూరి బాలకృష్ణ తొడగొడితే తాత్కాలిక అసెంబ్లీ పడిపోతుందేమో అని భయపడ్డాను అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణ, లోకేష్ కలిసి టిడిపిని కబ్జా చేయాలని, పదవి లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అచ్చెం నాయుడు పాత్రని బాలకృష్ణ పోషిస్తున్నాడు అసెంబ్లీలో.. యనమల కూడా కుర్చీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన పాపం పోదు కదా..? అని ప్రశ్నించారు. ఏపీ స్కిల్‌ స్కామ్‌లో 13 సంతకాలు చంద్రబాబు చేశాడని ఆరోపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. మరోవైపు నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం విదితమే.