Leading News Portal in Telugu

Governor Tamilisai : నేడు బెజవాడ రానున్న తెలంగాణ గవర్నర్ తమిళసై


నేడు విజయవాడలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పర్యటించనున్నారు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీనోపాద్యాయ పుస్తక ఆవిష్కరణ లో తమిళ సై పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30కి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే.. ‘చా­న్స్‌­లర్‌ కనెక్ట్స్‌ అల్యూమినీ’ కార్యక్రమంలో భా­గంగా గవర్నర్‌ తమిళిసై సోమ­వారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్‌ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.

సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సి­టీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తరువాత ఆమె విజయవాడకు బయలు దేరనున్నారు.