Leading News Portal in Telugu

ACB Court : చంద్రబాబు వరుస పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు


ACB Court : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. చంద్రబాబుకు సంబంధించి ఆయన తరఫు లాయర్లు వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. బెయిల్‌ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని చంద్రబాబు లాయర్లు.. న్యాయమూర్తిని కోరారు.. అయితే, ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని తెలిపింది కోర్టు.. అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడతామని పేర్కొన్న న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

అయితే, సీఆర్‌పీసీ ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని లాయర్ల కోరారు.. కానీ, జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్నారు ఇతర లాయర్లు.. కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటున్నారు. కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందని చెబుతున్నారు.. మరోవైపు.. సాంకేతిక కారణాల కోసం చంద్రబాబు లాయర్ల తాపత్రయపడుతున్నారని సీఐడీ తరపు లాయర్లు విమర్శిస్తున్నారు. అరెస్ట్‌ సమయంలో సీఐడీ అధికారుల కాల్‌ డాటా కావాలంటూ పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక, కాల్‌ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్‌ సమయంలోనూ చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా విజ్ఞప్తి చేశారు.. కాల్‌ రికార్డుల కేసులో వాదనలు వినిపించారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు.. విచారణకు చంద్రబాబు సకహరించడంలేదని.. కావాల్సిన సమాచారం రావడం లేదంటున్నారు సీఐడీ అధికారులు.. దీంతో.. మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం విదితమే.