Leading News Portal in Telugu

Roja: అర్థమైందా రాజా..! చంద్రబాబుకు మంత్రి కౌంటర్‌



Rk Roja

Roja: మరోవైపు.. వారంటీ లేని చంద్రబాబు వార్లెంట్లు తీసుకుని జైలుకు వెళ్లారంటూ అసెంబ్లీ సాక్షిగా సెటైర్‌ వేశారు మంత్రి రోజా. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. 40ఏళ్లలో చేయలేదని.. సీఎం జగన్‌ నాలుగేళ్లలో చేసి చూపించారన్నారు రోజా. సీఎం జగన్‌ను ఇంటికి పంపుతానన్న వాళ్లు జైలుకు.. భయపెడతామన్న వారు ఢిల్లీ వెళ్లిపోయారన్నారు మంత్రి రోజా. సీఎం జగన్‌ కళ్లలో భయముండదు.. ఒంట్లో బెదురుండదని అన్నారు. అర్థమైందా రాజా అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి రోజా. ఇక, వచ్చే ఎన్నికల జగనన్న సునామీ దెబ్బకు చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ కొట్టుకుపోతారన్నారు మంత్రి రోజా. ఎన్నికల తర్వాత టీడీపీకి, జనసేనకు రాసుకోవడానికి చరిత్ర ఉండదు.. చూసుకోవడానికి భవిష్యత్‌ ఉండదు అంటూ డైలాగ్‌ కొట్టారు.

Read Also: Minister Harish Rao: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు..?

చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువన్నారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబుది బోగస్ ఆలోచన అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు చీటర్.. జగన్ లీడర్ అంటూ కౌంటర్‌ ఇచ్చారు రోజా. ఇక, రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు సీఎం వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్‌ తీర్చుతున్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్‌ అంటున్నారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళల్లో మహిళల కోసం ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించిన మంత్రి.. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని సీరియస్‌ అయ్యారు. సీఎం జగన్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసన్నారు మంత్రి ఆర్కే రోజా.