రేపు ఏపీ సీఎం జగన్ గడప గడపకు సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పై సమీక్ష నిర్వహించి చర్చించనున్నారు. ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ కి నివేదికలు చేరడంతో.. ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలేది రేపేనా అని ఆయన అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న పొత్తుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. విస్తృతమైన బహిరంగ చర్చలు, కార్యకర్తలతో సమావేవాలు, అభ్యర్థుల ప్రకటనలు, ప్రతిపక్ష పార్టీలపై అవలంబించే వ్యూహం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ విస్తృతంగా ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రతిపక్ష పార్టీల ఆరోపణల మధ్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడమే ఈ యాత్ర లక్ష్యం. ఆరోపణలపై తన వైఖరిని స్పష్టం చేయాలని, రాజకీయ వ్యవహారాలతో వాటికి సంబంధం లేదని నొక్కి చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ పొత్తులను కొనసాగించకూడదని ఎంచుకున్నారు. ప్రచార నినాదం ‘వై నాట్ 175’, విస్తృతమైన సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను ఖచ్చితంగా ఎంచుకున్నారు.