Leading News Portal in Telugu

Chandrababu : నేడు జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు


టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదర్కొంటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. నేటికి 16వ రోజుకు చంద్రబాబు రిమాండ్ చేరింది. అయితే.. నేడు జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు కుటుంబ సభ్యులు. ఉదయం 8 గంటల తర్వాత ములాకాత్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ములాఖాత్ కు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఎందుకు..? ఇంకా ఏం చేయాల్సి ఉంది..? అనేదానిపై ఏసీబీ న్యాయమూర్తికి సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో రిమాండ్ ఇవ్వాలన్న సీఐడీ వాదనలపై చంద్రబాబు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ పొడిగిస్తే కారణాలు చెప్పాలని పోసాని డిమాండ్ చేయగా.. సీఐడీ తరఫు లాయర్లు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అక్టోబర్-05 వరకు చంద్రబాబును రిమాండ్‌ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

ఇదిలా ఉంటే.. ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం నుంచి అన్నవరం వెళ్ళనున్నారు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. అన్నవరం సత్యనారాయణ స్వామిని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి దర్శించుకోనున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ పత్తిపాడులో రిలే దీక్షలు కొనసాగిస్తున్న శిబిరాలకు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వెళ్లనున్నారు. నిరసన దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలపడంతో పాటు కాసేపు నిరసన దీక్ష శిబిరాల్లోనే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూర్చోనున్నారు.