Leading News Portal in Telugu

Holiday on September 28th: ఈ నెల 28న సెలవు.. ఏపీ ప్రభుత్వం ప్రకటన


Holiday on September 28th: ఈ నెల 28వ తేదీన సెలవుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజుగా పేర్కొంది.. అయితే, నెలవంక ఆధారంగా ముస్లిం మత పెద్దలు పండగ రోజును నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి 28న సెలవు దినంగా ప్రకటించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. కాగా, ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడు. ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొన్న విషయం విదితమే.. అయితే, ప్రవక్త మహమ్మద్ ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తాను జన్మించిన రోజున.. ఆయనను స్మరించుకుంటూ ఈద్- ఎ మిలాద్ -ఉన్ -నబీ పండుగను జరుపుకుంటారు ముస్లిం సోదరులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో వైభవంగా సాగే గణేష్‌ నిమజ్జనంతో పాటు.. మిలాద్ ఉన్ నబీ కూడా ఒకే రోజు రావడంతో.. ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీని వాయిదా వేసుకున్న విషయం విదితమే.