ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.. అయితే.. సూఫీ లేదా బరేల్వి ముస్లింలు ఇస్లాం యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఈద్ మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్గా జరుపుకుంటారు. దీనిని వ్యవహారిక అరబిక్‌లో నబీద్, మౌలిద్ అని కూడా పిలుస్తారు.
ఈ పండుగను ఇస్లామిక్ క్యాలెండర్లో మూడవ నెల అయిన రబీ అల్-అవ్వల్ సందర్భంగా సూఫీ, బరేల్వి ముస్లింలు జరుపుకుంటారు. ఈ పండుగను మవ్లీద్ అని కూడా పిలుస్తారు, దీనర్థం అరబిక్‌లో పుట్టుక. మవ్లీద్ “వాలాడ (Walada)” అనే పదం నుంచి ఉద్భవించింది, అంటే పుట్టడం అని అర్థం. అరబిక్‌లో “నబీ (Nabi)” అనే పదానికి “ప్రవక్త” అని అర్థం. మొత్తంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ అంటే “ప్రవక్త పుట్టిన పండుగ” అని అర్థం వస్తుంది. ముహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు, దయ, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే ముహమ్మద్‌ను అల్లాహ్ పుట్టించాడని విశ్వసిస్తారు.