Leading News Portal in Telugu

YSRCP Graph: ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ పెరిగింది.. ఈ కార్యక్రమం మరింత పెంచుతుంది..


YSRCP Graph: ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి.. ఎవరికి వారు నాయకులు ప్లాన్ చేసుకోండి అని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగనన్న సురక్ష కార్యక్రమంతో ఒక్కసారిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగిందన్నారు.. అంతే కాదు.. ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా పార్టీ గ్రాఫ్‌ను మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు.. విజయవాడ, హైదరాబాద్ నుండి చంద్రబాబు కోసం డబ్బులు పంపిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ధర్మాన.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ధర్నాల కోసం, కొవ్వుత్తులు, టీషర్ట్‌లు సైతం పంపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, అసైన్ భూముల్లో చాలా అవినీతి జరిగింది అని ఆరోపించారు.. అమరావతి ప్రాంతంలో పేదల భూములను ధనవంతులు కొట్టేశారని.. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

కాగా, స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి గతంలోనే సూచించారు మంత్రి ధర్మాన.. ద‌ర్యాప్తు సంస్థల‌కు స‌హ‌క‌రించి.. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న ఆయన.. మీరు ద‌ర్యాప్తు సంస్థలను న‌మ్మడం లేదు.. ఇదే సమయంలో మేం మిమ్మల్ని న‌మ్మడం లేదు. మీరు ఈ విధంగా స‌భ్య స‌మాజాన్ని రెచ్చగొట్టే చ‌ర్యల‌ను మానుకోవాలంటూ ధర్మాన వ్యాఖ్యానించిన విషయం విదితమే..