Leading News Portal in Telugu

Wooden Box: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె..


Wooden Box: విశాఖపట్నం తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది.. దీని బరువు సుమారు వందటన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. పురతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు పోలీసులు. బీచ్ లో వున్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు.. దీంతో.. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకువచ్చిన ఈ భారీ ఆకృతిలోని చెక్క పెట్టె.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు అధికారులు.. పురాతన పెట్టెపై ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు పోలీసులు.. అయితే.. ఆ పెట్టెలో ఏముందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలోనూ విశాఖ తీరానాకి కొన్ని వస్తువులు కొట్టికొచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే, ఇప్పుడు వచ్చిన చెక్క పెట్టెలో ఏముంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.