Leading News Portal in Telugu

Ragging: గుంటూరు మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌..! అధికారుల సీరియస్‌


Ragging: గుంటూరు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం సృష్టిస్తోంది.. సీనియర్లు తమను ర్యాగింగ్‌ చేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.. అయితే, మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణపై అధికారుల సీరియస్‌గా స్పందిచించారు.. మెడికల్ కాలేజీ వార్డెన్ లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తన ముందు హాజరుపరచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ జీవన్ ప్రదీప్.. మెడికల్ కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలు, ర్యాగింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టారు కాలేజీ అధికారులు.. ర్యాగింగ్ కళాశాల ఆవరణలో జరిగిందా..? లేక మరి ఎక్కడైనా జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.. అయితే, ర్యాగింగ్ ఎక్కడ జరిగినా దాని తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు మెడికల్‌ కాలేజీ అధికారులు.

కాగా, గతంలోనూ గుంటూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించడంతో వారు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని వసతి గృహంలో సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు పేర్కొన్నారు.. దీంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ర్యాగింగ్ పై విచారణ జరపాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించింది. ఇప్పుడు మరోసారి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ వ్యవహారం చర్చగా మారింది.. గ్యాగింగ్‌ విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంచే విధంగా ఉండాలని కానీ.. వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదంటూ పలు సందర్భాల్లో అధికారులు చెబుతున్నా.. యాంటీ ర్యాగింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.