ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి. అక్టోబరు 5 నుంచి 11వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించనుంది. 8వ తరగతి విద్యార్థులు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు జరుగనున్నాయి.
ఇక, అక్టోబరు 25 వరకు దసరా సెలవులు కొనసాగగా.. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందుపర్చింది. అదే విధంగా.. క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించింది. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాలి అని అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొంది.
ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇక ఈ ఏడాది దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు దసరా సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సెలవులను ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని తెలిపారు.