Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం, అక్రమ కేసులు పెట్టడం లాంటి రాజకీయాలను చూశామని, నెల్లూరు ప్రశాంతతకు మారుపేరు అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక్కడ కూడా కక్ష రాజకీయాలను అధికార పార్టీ నేతలు ప్రారంభించారని ఆయన అన్నారు. ఈ వేధింపులు, అక్రమ కేసులలో తనకే గోల్డ్ మెడల్ రావాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కి కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాకాని అధికారంలో ఉండేది మూడు నెలలు మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలోనైనా కొన్ని మంచి పనులు చేసి మీరు తెచ్చుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని ఆయన వెల్లడించారు.