మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి జాతీయ జెండా ఇచ్చిన నేల మీద గాంధీ జయంతి చేసుకోవడం నా అదృష్టం అని ఆయన వ్యాఖ్యనించారు. జాతి ప్రేరణ కోసం పెట్టినది మచిలీపట్నం లోని నేషనల్ కాలేజీ.. ఎందరో మహానుభావులు నేషనల్ కాలేజీ విద్యార్ధులు.. నేషనల్ కాలేజీలో ఒకసారైనా అడుగు పెట్టాలి.. ఇప్పుడు ఆ కాలేజీ పరిస్ధితి సరిగ్గాలేదు అని ఆయన ఎద్దేవా చేశారు. రాముడి పాటని ఈశ్వర్ అల్లా చేర్చి మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి మనం రుణపడి ఉంటాం అని జనసేనాని అన్నారు.
పది లక్షల మందిని జాతీయ గీతానికి నిలబెట్టిన నేల మచిలీపట్నం అని పవన్ కళ్యాణ్ అన్నారు. దోపిడీ భవిష్యత్తులో ఆగాలంటే ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి.. 2024 ఎన్నికల తరువాత మన ప్రభుత్వంలో మచిలీపట్నంలో గాంధీ జయంతి జరుపుకోవాలి.. మాట అంటే, నిరసన తెలిపితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెడతారు.. అంబేద్కర్ సేవలు ఉపయోగించుకోవాలని రాజ్యాంగ నిర్మాతగా తీసుకున్నది గాంధీజీ.. గాంధీజీకి అంబేద్కర్ కు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు చాలా కష్టమైనవి.. బ్రిటిష్ వారికి ఉన్న సంయమనం కూడా లేదు మన రాష్ట్ర నాయకులకు.. ఇప్పుడు సమకాలీన రాజకీయాలు సంయమనంతో ఉంటాయని ఆశిస్తున్నా.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. కలుషితమైన రాజకీయాల నుంచీ జనసేన అనే కమలం వస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
జగన్ ఉన్నాడని వైసీపీ రెచ్చిపోతే.. మిమ్మల్ని రక్షించాల్సింది మేమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. రేపు జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది.. అధికారంలోకి వచ్చాక కూటమిలో ఎలాంటి గొడవలు రావని నమ్ముతున్నాను.. ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబుతో విబేధాలు వస్తే.. అది ప్రజల కోసమే వస్తాయి.. మా దగ్గర డబ్బులు లేవు.. ప్రజలే నా కోసం ఖర్చు పెట్టి.. ఓట్లేయాలని.. ఓట్లేయించాలని కోరుతున్నాను.. అభివృద్ధి కావాలంటే జగన్ పోవాలి.. జనం బాగుండాలంటే జగన్ పోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.