Leading News Portal in Telugu

Posani: సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు


నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. జనసేన నేతల పిటిషన్‌పై విచారించిన కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద వన్ టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.