Leading News Portal in Telugu

Minister Kottu Satyanarayana: పవన్‌ కల్యాణ్‌కు మంత్రి కొట్టు కౌంటర్‌.. కాపులేమైనా పట్టం కట్టారా..?


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కౌరవులు అని పవన్‌ అంటున్నాడు.. కానీ, వైఎస్‌ జగన్‌ వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.. కౌరవ సేన అంత చంద్రబాబు నాయుడు వెనుకే ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు కాపుల గురించి ఏం తెలుసు? అంటూ మండిపడ్డారు.. పవన్ తీసుకునే తింగరి నిర్ణయాలను కాపులు అందరూ సమర్ధించాలని అనుకుంటున్నాడు.. కానీ, కాపులం ఏమైనా పవన్ కల్యాణ్‌కు పట్టం కట్టామా..? అంటూ నిలదీశారు. మరోవైపు.. కాపుల పరువు తీయవద్దు అంటూ పవన్‌కు విజ్ఞప్తి చేశారు.. కాపు పెద్దలను కూర్చో బెట్టి చంద్రబాబుకు మద్దతు ఇద్దాం, అవినీతిపరుడితో పొత్తు పెట్టుకుందాం అని చెప్పాడా? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

మరోవైపు, పవన్ కల్యాణ్‌ కి డబ్బు తప్ప వేరే ఆలోచన లేదంటూ గతంలోనే మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.. కాపు జాతిని పవన్ తాకట్టు పెట్టేశారని మండిపడ్డ ఆయన.. అమరావతి ల్యాండ్ స్కామ్ లో పవన్ కల్యాణ్ కి కూడా వాటా ఉందని ఆరోపణలు చేశారు.. దేశం యావత్తు కోడై కూస్తుంది.. పవన్ ప్యాకేజీలకి అమ్ముడుపోతున్నారని.. నేను పవర్ స్టార్ కదా నన్ను ప్యాకేజీ స్టార్ అని అంటున్నారేంటని ఆలోచన, బుద్ది ఉందా అని అడుగుతున్నా? చంద్రబాబుని లోపల వేస్తే సొంత కొడుకు హాయిగా ఉన్నాడు, దత్త కొడుకు రోడ్డు మీద పడుకున్నాడు.. చంద్రబాబు కలిసి పవన్‌కల్యాణ్‌.. వైఎస్‌ జగన్ కు మా తడాఖా చూపిస్తామన్నారరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.