Leading News Portal in Telugu

Chandrababu Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ 2.30కి వాయిదా


Chandrababu Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ 2.30కి వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అయితే, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ ప్రమోద్‌కుమార్ దూబే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు.. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్‌ వెళ్లి రీసెర్చ్ చేశారు.. ఆమె అధ్యయనం చేశాక సీమెన్స్‌ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందింది అనే ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాస్ట్ ఎవాల్యుయేషన్‌ కమిటీ స్కిల్‌ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్‌ ధరను నిర్ధారించింది.. ఆ కమిటీలో చంద్రబాబు లేరు.. కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని చంద్రబాబు తరపు లాయర్ దూబే వాదించారు. ఇక, సుప్రీంకోర్టు నవంబర్‌ 16 వరకు ఆయన బెయిల్‌ను పొడిగించింది అనే విషయాన్ని దూబే గుర్తు చేశారు.

అయితే, కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు. అయితే, అంతకు ముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాకుండానే ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.