Pawan Kalyan: ఎన్డీఏతో పాటు తెలుగుదేశం పార్టీతో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పెడన వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేనాని. దేశంలో అత్యధికంగా దేశద్రోహ కేసులు పెట్టింది ఏపీలోనే అన్నారు పవన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటూ ప్రశ్నించారు. టీడీపీ అనుభవం, జనసేన పోరాటం కలిస్తే రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమవుతుందన్నారు పవన్. టీడీపీ, జనసేన కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. టీడీపీ మీద కేసులు పెడితే తాము వస్తామని, మాపై కేసులుపెడితే మీరు రావాలని కోరారు. రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రాష్ట్రంనుంచి వైసీపీని తరిమేద్దామంటూ పిలుపునిచ్చారు.
టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ కలిస్తే జగన్‌ను అథఃపాతాళానికి తొక్కేయవచ్చన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ కష్టాల్లో ఉన్నందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మద్దతుగా నిలిచానన్నారు పవన్. సీఎం జగన్ కు తానంటే ఎంతో ప్రేమ అని సెటైర్లు పేల్చారు పవన్. తన సినిమాలప్పుడే టికెట్ల రేట్లు తగ్గిస్తారని, తన పుట్టిన రోజప్పుడే .. జగన్ కు పర్యావరణం గుర్తొస్తుందన్నారు పవన్. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు పవన్ కల్యాణ్. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కేసు పెడుతున్నారని అన్నారు. దేశంలోనే అత్యధికంగా ఈ కేసులు పెట్టింది ఏపీలోనే అంటూ మండిపడ్డారు. దేశభక్తితో పోరాటం చేస్తున్న తాను కేసులకు బయపడనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..