Leading News Portal in Telugu

BJP-Janasena: జనసేన-టీడీపీ కలిసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చాయా..పవన్ బంధం తెగిపోయిందా..?



Bjp Janasena

జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్‌ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. ఇక, టీడీపీతో పొత్తు పవన్‌ కళ్యాణ్ లో జోష్ కనిపిస్తుంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువగా జనసేనాని స్పందిస్తున్నారు. అయితే ఎన్నికల వరకైనా బీజేపీతో పొత్తు ఉంటుందని అందరు అనుకున్నారు.. కానీ, ఆ పుకార్లకు ఇప్పుడే పుల్ స్టాప్ పెట్టేశారు.

Read Also: Cement Prices: పెరుగుతున్న సిమెంట్ ధరలు.. విలవిలలాడుతున్న సామాన్యుడు

అయితే, తెలంగాణలో పోటీ చేసే స్ధానాలను ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 32 స్ధానాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. పోటీ చేసే స్ధానాలను కూడా ఖరారు చేసేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఏన్డీయే కూటమిలో ఉన్న పవన్.. ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ కూటమికి దూనమైనట్లేనని కనిపిస్తుంది. దీంతో వాస్తవానికి బీజేపీతో కంటే టీడీపీతో కలిసి వెళ్తేనే జనసేనకు మైలేజీ వస్తుందని పవన్ భావించారు.

Read Also: Tiger-3 : టైగర్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రూపంలో జాక్ పాట్ తగలడంతో వచ్చిన ప్రతీ ఛాన్స్ ను ఆయన సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఎన్డీయే కూటమిలో ఉన్నా బీజేపీతో సంప్రదించకుండానే టీడీపీతో పొత్తును పవన్ కళ్యాణ్ ఖరారు చేసుకున్నారు. ఇక వారాహి యాత్రలో ఏపీలో వచ్చేది టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీకి రాం రాం చెప్పినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణలో పోటీ చేసే స్థానాలను ప్రకటించి బీజేపీతో ఫ్రెండ్ షిప్ కు పవన్ కళ్యాణ్ పుల్ స్టాప్ పెట్టేశారు.