Sajjala Ramakrishna Reddy: టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా?.. ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు..?
కృష్ణ ట్రిబ్యునల్ సమీక్ష అంశం వచ్చిందే నిన్న అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు.. కృష్ణ జలాల అంశాన్ని తిరగదోడటం సరికాదు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సాంకేతిక నిపుణులు, అధికారులు సమీక్ష చేస్తారు అని ఆయన అన్నారు. టీడీపీ బలహీన పడిందని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారా?.. టీడీపీ పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు.. టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా?.. టీడీపీకి పవన్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి అని సజ్జల డిమాండ్ చేశారు.
చంద్రబాబు కేసుల గురించి సీఎం జగన్, ప్రధాని మోడీతో మాట్లాడలిసిన అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాల తో చంద్రబాబు జైల్లో వున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి జగన్ కేంద్రంతో మాట్లాడతారు.. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ త్వరగా తిరిగి వస్తే కేసు తేలుతుంది అని ఆయన అన్నారు. చంద్రబాబు అయినా శ్రీనివాస్ ని తిరిగి రమ్మని చెప్పాలి.. చంద్రబాబు కేసులో ఆయన తరపు న్యాయవాదులు కూడా టెక్నీకల్ అంశాల పైనే మాట్లాడుతున్నారు.. చిన్న పిల్లలతో సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైస్సార్ మరణాన్ని తిట్టిస్తున్నారు అంటూ సజ్జల మండిపడ్డారు. పిల్లలు తిడుతుంటే పక్కన కూర్చుని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆనందిస్తున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.