Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదు.. కొందరు సినీ పెద్దలు తప్పితే.. బాబు అరెస్ట్‌పై ఎవరూ నోరు మెదిపింది లేదు.. అయితే, దీనిపై ఇప్పటికే బాలయ్య.. స్పందించకపోయినా పట్టించుకోం.. ఐ డోంట్ కేర్.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి ఒత్తిడి ఉంటుందన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారని తెలిపారు.. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మండలాధీశుడు వంటి చాలా సినిమాలు తీశారు. కోట, పృధ్వీ వంటి వారు ఎన్టీఆర్ క్యారెక్టర్లో నటించారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ఏం మాట్లాడాలన్న భయంతో ఉన్నారని తెలిపారు.
అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి.. మొండి వాడ్ని కాబట్టి.. నేను స్పందించాను అని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.. ఇక, సీట్లు కేటాయింపు అనేది బహుత్ దూర్ కీ బాత్ గా పేర్కొన్న ఆయన.. టీడీపీ బలహీన పడిందనేది మీ అభిప్రాయం.. సజ్జల అభిప్రాయంగా తెలిపారు. చంద్రబాబును రజనీకాంత్ పొగిడినందుకు ఆయన్నే వదలలేదు. సినీ ఇండస్ట్రీ అనేది వల్నరబుల్. ఇండస్ట్రీకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. మరోవైపు.. జీ-20 సదస్సు జరుగుతున్నప్పుడు నక్క జిత్తులతో చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే వైఖరికి అనుగుణంగానే టీడీపీకి మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలు బిజీగా ఉండడం వల్ల టీడీపీతో పొత్తు విషయం చెప్పలేకపోయాం.. బీజేపీతో సమన్వయ కమిటీ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీతో కలిసి పోరాటాలు కూడా చేశాం. సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు.. సమన్వయ కమిటీ సభ్యులుగా మహేందర్ రెడ్డి, ఉమేష్, గోవింద్, విశ్వేశ్వరయ్య, బొమ్మిడి నాయకర్ ఉన్నారని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.