Leading News Portal in Telugu

Atchannaidu : వైసీపీ నేతలు పిచ్చిగా వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదు


స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషనుకు సంబంధించిన పూర్తి వాస్తవాల ప్రతిరూపమే ఈ పుస్తకమని, త్వరలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాలను కూడా పూర్తివాస్తవాలతో పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రూ.3,300 కోట్ల అవినీతి అని విషప్రచారం చేసి, చివరకు రూ.27కోట్ల పార్టీ ఫండ్ ను అవినీతి సొమ్ముగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల్ని అవినీతి సొమ్ముగా చూపడం ఈ ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లుతాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనమని ఆయన అవ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన నిధులకు.. జగన్ సర్కార్ చెబుతున్న అవినీతికి సంబంధమేంటి? అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా..’అసలు అవినీతి సొమ్ము అంటే జగన్ రెడ్డి ఖాతాలకో.. అతని కంపెనీలకో.. అతని భార్య ఖాతాకో వచ్చినట్టు వచ్చే సొమ్ము. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 28 రోజులవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు బయట పెట్టలేక చివరకు పార్టీకి వచ్చిన నిధులపై పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రేపు టీడీపీ ఆధ్వర్యంలో “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” కార్యక్రమం. రేపు రాత్రి 7 గం.లకు ఇళ్లలో లైట్లు ఆర్పి 5 నిమిషాల పాటు నిరనస తెలపాలి. ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన చేయాలి. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, కార్లలో ఉంటే వాహన హెడ్ లైట్లు ఆన్, ఆఫ్ చేస్తూ నిరసన తెలపాలి. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.’ అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.