Leading News Portal in Telugu

YSRCP Representatives Meeting Live Updates : వైసీపీ ప్రతినిధుల సభ.. సీఎం కీలక ఆదేశాలు


Live Now

YSRCP Representatives Meeting: విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సబస్సు అట్టహాసంగా సాగుతోంది.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన 8 వేల మందికి పైగా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ చీఫ్‌, సీఎం వైఎస్‌ జగన్‌.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా ముందకు సాగాలని స్పష్టం చేశారు.. ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు ఈ పేజీనీ ఫాలో అవ్వండి..

  • 09 Oct 2023 12:11 PM (IST)

    పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ వరుసగా కార్యక్రమాలు

    జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు సీఎం జగన్‌.. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు.. మూడు వేల రూపాయలకు పెరుగనున్న పెన్షన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంపు ఉంటుందన్నారు.. పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు ఉంటాయన్నారు.. గ్రామ స్థాయిలో జరిగే సంబరాల్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.


  • 09 Oct 2023 11:52 AM (IST)

    బీసీల కోసం నిబద్దతతో పని చేస్తున్న నాయకుడు జగన్

    బీసీల కోసం నిబద్దతతో పని చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్న ఆయన.. బీసీల కోసం నిబద్దతతో పని చేస్తున్న నాయకుడు జగన్.. త్వరలోనే రాష్ట్రంలో బీసీ జన గణన ప్రారంభం కానుంది.. దీని కోసం ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం.. బీసీ జన గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు..


  • 09 Oct 2023 11:51 AM (IST)

    దూరదృష్టి ఉన్న జగన్‌ లాంటి సీఎం చరిత్రలో లేరు

    చరిత్రలో వైఎస్‌ జగన్ లాగా దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. పేదవాడి కోసం తపించే నాయకుడు జగన్.. అందుకే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం ఉందన్నారు.. వైసీపీకి సైన్యంలాగా అందరం కలిసి కట్టుగా పని చేయాలి.. జగన్ ను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.


  • 09 Oct 2023 11:46 AM (IST)

    4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన వైసీపీ

    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సభలో నాలుగు కీలక కార్యక్రమాలను ప్రకటించింది ఆ పార్టీ.. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా పేరుతో నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.. ప్రతి సచివాలయ పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల దగ్గరకు వెళ్లేవిధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది వైసీపీ.. మొదటి దశలో సచివాలయ పరిధిలోని లబ్దిదారుల జాబితా ప్రదర్శించనున్నారు.. రెండో దశలో పార్టీ జెండాల ఆవిష్కరణ.. మూడో దశలో ఇంటింటి సందర్శన.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పని తీరును పోలిస్తూ వివరించడం చేయనున్నారు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు..