Leading News Portal in Telugu

Minister Usha SriCharan: పవన్ కళ్యాణ్ కొత్తగా టీడీపీతో జతకట్టలేదు.. టీడీపీతోనే ఉన్నారు..


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని మంత్రి ఉషశ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీచరణ్ కు ఆలయ పండితులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. అయితే, NTVతో మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ఏపీలో మహిళా సాధికారత పూర్తిస్ధాయిలో జరుగుతోంది అని తెలిపారు.

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు అని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఏపీలో పూర్తి స్ధాయి అవకాశాలు కల్పిస్తున్నారు.. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి కొత్తేం కాదు.. పవన్ కళ్యాణ్ కొత్తగా టీడీపీతో జతకట్టలేదు.. పవన్ టీడీపీతోనే ఉన్నారు అంటూ మంత్రి ఆరోపించారు. రాయలసీమ లోనే కాదు ఏపీ మొత్తంలో పవన్ కళ్యాణ్ వారాహి ప్రభావం ఉండబోదు.. ఏపీలో 175కు 175 స్ధానాల్లో 2024 ఎన్నికల్లో గెలుపొంది తీరుతాం అని మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు. ఏపీలో వైసీపీ గెలిచి మరోసారి జగన్ మోహన్ రెడ్డి.. సీఎంగా అధికారంలోకి వస్తారని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనతో పాటు ఎన్ని పార్టీలు అయినా కలిసి వచ్చిన వైసీపీని ఓడించడం కష్టమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.