Leading News Portal in Telugu

Nakka Anandbabu: చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనం


Nakka Anandbabu: సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తల్లి, చెల్లి తప్ప ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడమంటే.. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక్కాదు జగన్ పై ఆనంద్ బాబు ఫైరయ్యారు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి.. కేసుల భయంతో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడమేనా జగన్ విశ్వసనీయత అని దుయ్యబట్టారు. తల్లి, చెల్లిని తరమేసి.. బాబాయిని చంపి బాత్రూములో పడుకోబెట్టడమేనా జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. సొంత బాబాయ్ కూతురు రాష్ట్రంలో తనకు న్యాయం జరగదంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టడమేనా జగన్ సాధించిన విశ్వసనీయత అని అన్నారు. తండ్రి చావుకి రిలయన్స్ సంస్థే కారణమని చెప్పి… ముఖ్యమంత్రయ్యాక అదే సంస్థ వైస్ ఛైర్మన్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమేనా జగన్ విశ్వసనీయత అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.