
Meruga Nagarjuna: పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వచ్చాడని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. పవన్ ఎవరి కోసం పార్టీ పెట్టాడు.. ఎవరి కోసం పనిచేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ పార్టీ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ఓ బలీయమైన శక్తి అయిన కాపు కమ్యూనిటీని పవన్ ఎవరి కోసం తాకట్టు పెట్టారో చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ కోసం పనిచేస్తుందా.. చంద్రబాబు కుటుంబం కోసం పనిచేస్తుందా.. రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి తిరుగుతున్నారా పురంధేశ్వరి సమాధానం చెప్పాలన్నారు. పురంధేశ్వరి మద్యం అమ్మిందో.. ఏం చేసిందో మాకు తెలుసన్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీని బలోపేతం చేయాలి.. కానీ తన చెల్లిలి కొడుకును తీసుకుని అమిత్ షా దగ్గరకు తీసుకువెళ్ళటానికి సిగ్గుపడాలన్నారు. తెలంగాణ ఎన్నికలతో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఏపీ ఉజ్వల భవిష్యత్తే సీఎం జగన్ లక్ష్యమన్నారు. త్వరలో మూడు రాజధానులు పెట్టి.. వెళ్లి తీరుతామన్నారు.