Leading News Portal in Telugu

AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సత్కరించిన వీఆర్‌ఏ సంఘం నాయకులు


AP CM Jagan: ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను సత్కరించిన  వీఆర్‌ఏ సంఘం నాయకులు

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను వీఆర్‌ఏ సంఘం నాయకులు కలిసి కృతజ్ఙతలు తెలిపారు. రద్దు అయిన డీఏను పెంచి మరీ ఇస్తుండడంపై సీఎంను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసిన విషయం ఏపీజీఎఫ్‌ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దానిని కొనసాగించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. రూ. 300 కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీజీఎఫ్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎంని సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.