Leading News Portal in Telugu

Balakrishna: చంద్రబాబుకేమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత


Balakrishna: చంద్రబాబుకేమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత

Balakrishna: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంతో జగన్మోహన్‌ రెడ్డి చెలగాటమాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. చంద్రబాబును అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులతో జైలు పాల్జేసినా పగ చల్లారలేదా అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ను ఇబ్బంది పెడతారా అంటూ మండిపడ్డారు. ఫేక్ హెల్త్ రిపోర్టులు ఇచ్చి ఎవరిని మభ్య పెడదామనుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలన్నారు. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలన్నారు. చంద్రబాబుకేమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు బాలకృష్ణ. చంద్రబాబు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మరో 2 కేజీల బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.