
మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. టోఫెల్ విషయంలో తప్పులు జరుగుతున్నాయని మేం అలెర్ట్ చేస్తే.. అవగాహన పెంచుకోమని మంత్రి బొత్స మాకేదో చెప్పారన్నారు. మేం టోఫెల్ జరిగిన తప్పిదాలపై ఆధారాలతోనే మాట్లాడుతున్నామని ఆయన వెల్లడంచారు. అసలు మంత్రి బొత్సకు టొఫెల్ విషయంలో ఈటీఎస్ సంస్థతో జరిగిన ఒప్పందం గురించి తెలుసా..? టోఫెల్ పరీక్షల కోసం చేసుకున్న ఒప్పందం 54 పేజీలు ఉన్నాయని మంత్రి బొత్సకు తెలుసా..? అని నాదెంట్ల మనోహర్ ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘ఈటీఎస్ సంస్థతో ఒప్పందంలోని వివరాలను మంత్రి బొత్సకు సీఎంఓ అందించిందా..? టొఫెల్ శిక్షణపై ఈటీఎస్ సంస్ఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలపై మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేసింది. సీనియర్ మంత్రి అయిన బొత్సను కూడా సీఎంఓ పక్కదారి పట్టించిందనేదే మా అభిప్రాయం. గ్యారెంటీ మినిమమ్ పర్చేజ్ క్లాజ్ కింద 1.06 కోట్ల మంది విద్యార్ధులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ కేవలం 80 వేల మంది విద్యార్థులతోనే టోఫెల్ పరీక్షలు రాయిస్తామని మంత్రి చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి టోఫెల్ పరీక్షల కోసం రూ. 1000 ఖర్చు చేయబోతున్నారు. అసలు మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఎందుకు..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ పరీక్ష రాస్తారు.
అలాంటి పరిస్థితుల్లో మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ పరీక్షలు ఎందుకు..?టోఫెల్ స్కోర్ వాలిడిటి రెండేళ్లు మాత్రమే ఉంటుందని ఈటీఎస్ సంస్థే చెప్పింది. టోఫెల్ శిక్షణ కోసం ఇచ్చే మెటిరీయల్ ఎలా ఉండాలి.. ఎలాంటి పేపర్ వాడాలనే అంశాన్ని కూడా ఈటీఎస్ సంస్థే ఫైనలైజ్ చేసేలా ఈటీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మేం టొఫెల్ శిక్షణలో తప్పిదాలను ప్రస్తావిస్తే.. మా పార్టీని బొత్స విమర్శిస్తున్నారు. వైసీపీకి అధ్యక్షుడెవరని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.. మంత్రి బొత్స దీనికేమంటారు..? ఎన్నికల సంఘం వేసిన ప్రశ్నల ప్రకారం చూస్తే.. వైసీపీ తాడూ బొంగరం లేని పార్టీ. వైసీపీకి క్రియాశీలక సభ్యులే లేరు.. సభ్యత్వమే లేదు.’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు